ద్విచక్ర వాహనాల ఢీ ఒకరి మృతి మరొకరి పరిస్థితి విషమం
NEWS Dec 25,2024 05:29 pm
మల్లాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ వద్ద ఎదురు ఎదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. రాంనర్సయ్య అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. నితిన్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.