Logo
Download our app
ఎస్ఎస్ఏ ఉద్యోగుల వినూత్న నిరసన
NEWS   Dec 25,2024 04:50 pm
కామారెడ్డి: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె 16వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా బుధవారం విద్యార్థులకు రోడ్డుపై చదువులు చెప్పి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు శ్రీధర్, రాములు, సంతోష్ రెడ్డి, శైలజ తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source