అంబరాన్ని తాకిన క్రిస్మస్ వేడుకలు
NEWS Dec 25,2024 04:52 pm
ప్రతిఒక్కరూ విశ్వాసం కలిగి ఏసుక్రీస్తును ఆరాధించాలని, ఆయనను మన హృదయాల్లో కి ఆహ్వానించినప్పుడే నిజమైన క్రిస్మస్ అని బోధించారు. క్రీస్తు బోధనలను ఆచరించాలన్నారు. ప్రేమ, దయ, క్షమ, శాంతి, సహనం, సమాధానం వంటి గుణాలు కలిగి ఉండాలని సూచించారు. కేతనకొండ గ్రేస్ మినిస్ట్రీస్ చర్చిలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ డాక్టర్ పాస్టర్ మోగులూరి ఎలీషా మాట్లాడుతూ సర్వలోక పాప పరిహారార్ధమై ఏసుక్రీస్తు మానవుడిగా జన్మించాడని చెప్పారు.