యూనివర్సిటీలో ముగిసిన తరగతులు
NEWS Dec 25,2024 04:51 pm
భాషలో మెళకువలపై తెలంగాణలో తొలిసారి తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించిన తెలుగు అధ్యాపకుల పునశ్చరణ తరగతులు ముగిశాయి.తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగం, సెంట్రల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా లాంగ్వెజెస్-మైసూర్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కొనసాగిన పునశ్చరణ తరగతులకు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ యూనివర్సిటీలకు చెందిన తెలుగు అధ్యాపకులు హాజరయ్యారు. చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సూర్య ధనుంజయ ముఖ్య అతిదిగా హాజరై ప్రసంగించారు .