రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక
NEWS Dec 25,2024 11:56 am
తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కాపర్తి సంగమేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రకటించారు. ఎల్లారెడ్డిలో రెవెన్యూ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఇందులో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా అశోక్, కోశాధికారిగా చిన్నారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు, తహసీల్దార్ లు, నాయబ్ తహసీల్దార్‌లు పాల్గొన్నారు.