Logo
Download our app
దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా
NEWS   Dec 25,2024 03:23 am
మెట్ పల్లికి చెందిన రాజమణికి అయ్యప్ప ఆలయ సమీపంలోని ఓ వ్యక్తి వద్ద డబ్బులు రావాల్సి ఉందన్నారు. వాటిని ఇవ్వాలని అడిగితే ఇంటికి వస్తే ఇస్తామని అనడంతో భర్తతో కలిసి 22న వారి ఇంటికి వెళ్లగా, అక్కడే ఉన్న ముగ్గురు వ్యక్తులు కలిసి దాడి చేసారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింప చేశారు. దాడి ఘటనపై 22 న ఎలాంటి ఫిర్యాదు రాలేదని, ఈరోజు ఫిర్యాదు తీసుకొని కేసు చేశారు ఎస్సై తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source