Logo
Download our app
ప్రమాద బీమా చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NEWS   Dec 24,2024 06:53 pm
కామారెడ్డి, ఎల్లారెడ్డి: విద్యుత్‌ ప్రమాదానికి గురై మృతి చెందిన బాధిత కుటుంబాలకు మంగళవారం ఎమ్మెల్యే మదన్మోహన్‌ రావు చెక్కులను పంపిణీ చేశారు. లింగంపేటకు చెందిన కొట్టూరి చంద్రకళ, కొయ్య గుండు తండాకు చెందిన కేతావత్‌ అంజిలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో విద్యుత్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source