Logo
Download our app
మైనర్ కొడుకు నిర్ల‌క్ష్యం - తల్లిపై కేసు
NEWS   Dec 24,2024 03:48 pm
మైనర్ కొడుకుకు వాహ‌నం ఇవ్వ‌డంతో నిర్ల‌క్ష్య‌ డ్రైవింగ్ చేస్తూ వ్యక్తి మరణానికి కారణం అవ్వ‌డంతో తల్లిపై కేసు నమోదు చేసి రిమాండు తరలించినట్టు సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈనెల 18న రుద్రంగిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని కంటి రాములు అనే వ్యక్తి మరణించాడని తెలిపారు. రుద్రంగికి చెందిన గడ్డం లక్ష్మీ అనే మహిళ తన కొడుకు మైనర్ అయినప్పటికీ తన వాహనం ఇవ్వడం వలన ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశామన్నారు.
⚠️ You are not allowed to copy content or view source