ఏఐ టెక్నాలజీతో టీటీడీ అనుసంధానం
NEWS Dec 24,2024 09:44 am
టీటీడీ ఏఐ టెక్నాలజీపై దృష్టి సారించింది. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. ఒక్కోసారి గంటల తరబడి సమయం పడుతోంది. నివారించేందుకు టీటీడీ నడుం బిగించింది. 2 లేదా 3 గంటలలో దర్శనం అయ్యేలా ఏఐని వినియోగించాలని నిర్ణయించింది. అనుభవం కలిగిన రెండు సంస్థలు డెమో ఇచ్చాయి. ఇంకొన్ని కంపెనీలతో చర్చించి ఫైనల్ చేస్తామన్నారు చైర్మన్.