Logo
Download our app
37.6 లక్షల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయిన జియో
NEWS   Dec 24,2024 03:09 am
నిన్న‌టి దాకా టెలికాం రంగాన్ని శాసిస్తూ వ‌చ్చిన ముఖేష్ అంబానీకి చెందిన ప్రైవేట్ టెలికాం కంపెనీ రిల‌య‌న్స్ జియోకు కోలుకోలేని షాక్ త‌గిలింది. భార‌త సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొట్టిన దెబ్బ‌కు ఠారెత్తింది. కేవ‌లం ఒక నెల‌లో 37.6 ల‌క్ష‌ల మొబైల్ సబ్ స్క్రైబ‌ర్ల‌ను కోల్పోయింది. గ‌త నాలుగు నెల‌ల్లో ప్లాట్‌ఫారమ్ నుండి మొత్తం 1.65 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు నిష్క్రమించారు.
⚠️ You are not allowed to copy content or view source