Logo
Download our app
కేసు భయంతో వ్యక్తి ఆత్మహత్య
NEWS   Dec 23,2024 03:59 pm
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేశ్వరావుపేటకు చెందిన జంగిటి చిన్న నర్సయ్య (45) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ అనిల్ సోమవారం తెలిపారు. అడవి జంతువుల షికారు కోసం చిన్న నర్సయ్య ఫెన్సింగ్ తీగకు కరెంట్ షాక్ పెట్టగా.అది తాకి అదే గ్రామానికి చెందిన నవీన్ శనివారం మృతి చెందాడు. నవీన్ మృతితో భయపడి నర్సయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source