అటవీ భూములను రక్షించండి
NEWS Dec 23,2024 03:54 pm
అటవీ భూములను రక్షించాలని కోరుతూ మెట్ పల్లి మండలం ఆత్మకూర్ గ్రామస్తులు గ్రామాభివృద్ధి కమీటి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి చెందిన సుమారు 400 ఎకరాల అటవీ భూమిని ధ్వంసం చేశారని, రాత్రి వేళలో ఈ భూమిని జేసీబి, ట్రాక్టర్ల సహాయంతో చదును చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. అటవీ భూమిని రక్షించాలని కలెక్టర్ ను కోరారు.