Logo
Download our app
మామిడి తోటలో కరెంట్ షాక్‌తో మృతి
NEWS   Dec 22,2024 03:55 pm
ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వరరావు పేట గ్రామానికి చెందిన జంగిటి నవీన్ (32) మామిడి తోటలో కరెంట్ షాక్‌తో మృతి చెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. గ్రామ శివారులోని మామిడి తోట చుట్టూ అడవి పందుల కోసం కంచె ఏర్పాటు చేసి ఉంచగా గమనించని నవీన్ దాటేందుకు ప్రయత్నిస్తూ కరెంట్ షాక్ గురై మరణించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య జంగిటి రజిత ఫిర్యాదు మేరకు కరెంట్ షాక్ పెట్టి ఉంచిన జంగిటి నరసయ్యపై చట్టమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source