అల్లు అర్జున్ వన్నీ అబద్దాలే
NEWS Dec 22,2024 11:03 am
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అల్లు అర్జున్ పై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చాతాపం వ్యక్తం చేస్తారని అనుకుంటే అదేమీ లేకుండా తాపీగా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆరోజు థియేటర్ నుంచి మీరు ఎలా వెళ్లారనేది వీడియోలు ఉన్నాయని పేర్కొన్నారు. రేవతి ఘటన తెలిసినా టపాసులు కాల్చడం దారుణమన్నారు.