సంధ్య థియేటర్ యజమానికి నోటీస్
NEWS Dec 22,2024 10:43 am
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్బంగా చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యానికి పోలీసులు మరోసారి ఝలక్ ఇచ్చారు. తదుపరి చర్యలకు సిద్దమవుతున్నారు. తొక్కిసలాట ఘటనపై 10 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. లేకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించినా పట్టించు కోలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇవ్వడం షాక్ కు గురి చేసింది.