డాక్టర్ అంబేద్కర్ ఖచ్చితంగా దేవుడే
NEWS Dec 22,2024 10:03 am
మాజీ మంత్రి నీలకంఠాపురం రఘువీరా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య భారతదేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఖచ్చితంగా భగవంతుడేనని అన్నారు. రాజ్యాంగం దేశ ప్రజల్లో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుతోన్న పవిత్ర గ్రంథం అని పేర్కొన్నారు. ఆనాడు తమ పార్టీనే అంబేద్కర్ కు బాధ్యతలు అప్పగించిందన్నారు.