Logo
Download our app
మెరుగైన విద్య వైద్యం అందించడమే లక్ష్యం
NEWS   Dec 22,2024 03:58 pm
ప్రజలకు మెరుగైన విద్య వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో రూ. కోటి 56 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదివారం అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు.
⚠️ You are not allowed to copy content or view source