ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు
NEWS Dec 22,2024 08:15 am
ఓ వైపు భారీ వర్షాలు మరో వైపు భూ ప్రకంపనలతో జనం బెంబేలెత్తి పోతున్నారు. మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లాలో భూమి కంపించింది. రెండు సెకన్ల పాటు ఒత్తిడికి లోనైంది. ఆదివారం మరోసారి ప్రకాశం జిల్లా ముండ్లమూరులో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 10.41 నిమిషాలకు 2 సెకన్ల పాటు కంపించింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.