Logo
Download our app
త్వ‌ర‌లో ఆర్టీసీకి 1400 కొత్త బ‌స్సులు
NEWS   Dec 22,2024 08:06 am
ఏపీఎస్ఆర్టీసీకి తీపి క‌బురు చెప్పారు మంత్రి రాం ప్ర‌సాద్ రెడ్డి. త్వ‌రలోనే ఆర్టీసికి 1400 బ‌స్సుల‌ను కొనుగోలు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. విశాఖ‌ప‌ట్నంలో నూత‌న ఆర్టీసీ బ‌స్సుల‌ను ప్రారంభించారు. అంతే కాకుండా ర‌వాణా ప‌రంగా 2 వేల ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను తీసుకు రావాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు చెప్పారు. ఉచిత బ‌స్సు స‌ర్వీస్ స్కీం కోసం ప్ర‌భుత్వం నూత‌న స‌బ్ క‌మిటీని ఏర్పాటు చేయ‌డం జరిగింద‌న్నారు మంత్రి.
⚠️ You are not allowed to copy content or view source