మాజీ డీజీ వెంకటేశ్వర్ రావుకు రిలీఫ్
NEWS Dec 22,2024 04:08 am
మాజీ ఇంటిలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వర్ రావుకు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును ఉపసంహరిస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై కేసులు నమోదు చేయడంతో పాటు పోస్టింగ్ ఇవ్వకుండా ముప్పతిప్పలు పెట్టింది. కాగా టీడీపీకి వెంకటేశ్వర్ రావు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.