అబద్దాలు చెప్పడంలో సీఎం నెంబర్ వన్
NEWS Dec 21,2024 12:52 pm
అబద్దాలు చెప్పడంలో సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ వన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. అబద్దాలకు సంబంధించి గిన్నిస్ బుక్ రికార్డుల్లో ఎక్కుతారంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చేతకాని తనం ఏమిటో అసెంబ్లీ సాక్షిగా తేలి పోయిందన్నారు. రుణ మాఫీ, రైతు భరోసా, రైతు బీమా, ఉద్యోగాల భర్తీ విషయంలో చేతులెత్తేసిందన్నారు. ఇక సీఎం గాలి కబుర్లు తప్పా చేసింది ఏమీ లేదన్నారు.