Logo
Download our app
పీఆర్ఓ పోస్టుల‌కు ప్ర‌భుత్వం ఆహ్వానం
NEWS   Dec 21,2024 04:00 am
ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కేబినెట్ లో 24 మంది మంత్రుల‌కు సంబంధించిన పేషీ ల్లో ప‌బ్లిక్ రిలేష‌న్ ఆఫీస‌ర్ (పీఆర్ఓ) పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు సీఎస్ నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. డిగ్రీ పాసై, మీడియా రంగంలో 5 ఏళ్ల పాటు ప‌ని చేసిన అనుభవం క‌లిగిన వారు త‌క్ష‌ణమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరారు. ప్ర‌తి నెలా రూ. 37 వేల వేత‌నం ఉంటుంద‌ని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source