బోనాలతో ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరసన
NEWS Dec 20,2024 12:56 pm
ఎస్ఎస్ఏ ఉద్యోగులు కామారెడ్డిలో బోనాలతో ఊరేగింపు నిర్వహించి నిరసన తెలిపారు. మున్సిపల్ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వద్ద ఉన్న మైసమ్మ ఆలయం వరకు బోనాలను అమ్మ వారికి సమర్పించారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేలా అనుగ్రహం కల్పించాలని మొక్కుకున్నారు. ఎస్ఎస్ఏ సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా పాలనలో ఆడ పడుచులు నిరసన చేపడుతున్నా పట్టించు కోవడం లేదన్నారు.