రైతుల ఆందోళన ప్రియాంక ఆవేదన
NEWS Dec 20,2024 10:48 am
మోడీ సర్కార్ రైతుల పట్ల అనుసరిస్తున్న విధానాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ ప్రియాంక గాంధీ. బీజేపీ పదేళ్లలో రైతులను దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి అన్యాయం చేశారంటూ వాపోయారు. కనీస మద్దతు ధర చట్ట బద్దమైన హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మోడీ స్పందించి రైతుల డిమాండ్లను అంగీకరించాలని కోరారు.