Logo
Download our app
రాష్ట్రపతితో విద్యాసాగ‌ర్‌రావు భేటీ
NEWS   Dec 19,2024 02:59 pm
హైదరాబాద్: శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్న‌మ‌నేని విద్యాసాగర రావు మర్యాదపూర్వకంగా స‌మావేశమయ్యారు. బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి నివాసంలో జ‌రిగిన ఈ భేటీలో విద్యాసాగర రావు తాను రాసిన ఉనిక పుస్తక ప్రతిని రాష్ట్రపతికి అందించారు. విద్యాసాగర రావు కుటుంబ స‌భ్యులు ద్రౌపది ముర్ముతో మ‌ర్యాద‌పూర్వ‌కంగా ముచ్చ‌టించారు.
⚠️ You are not allowed to copy content or view source