జామ కాయలు అమ్ముతూ వినూత్న నిరసన
NEWS Dec 19,2024 08:17 am
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు నిర్మల్ ఆర్డీఓ ఆఫీసు ఎదుట వినూత్న నిరసన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటాన్ని ముందు పెట్టి జామ కాయలు అమ్మారు. గత కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టినా సర్కార్ పట్టించు కోవడం లేదని ఆరోపించారు. కావాలని జాప్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా తను ఇచ్చిన మాట సీఎం నిలబెట్టు కోవాలని కోరారు.