అమిత్ షా రాజీనామా చేయాలి
NEWS Dec 19,2024 05:13 am
భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను చట్ట సభలో అవమానించేలా మాట్లాడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కోట్లాది మంది ప్రజలకు ఆరాధకుడైన అంబేద్కర్ పట్ల చులకన భావం కలిగి ఉండడం దారుణమన్నారు.