అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పాలి
NEWS Dec 19,2024 05:00 am
భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్. ఆయన చేసిన వ్యాఖ్యలు రాచరికపు మనస్తత్వాన్ని, మను స్మృతికి మేలు చేకూర్చేలా ఉన్నాయని ఆరోపించారు. ఏ రాజ్యాంగం ద్వారా అధికారంలోకి వచ్చారో దానినే కించ పర్చేలా మాట్లాడటం తగదన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు .