అమిత్ షా కామెంట్స్ షర్మిల సీరియస్
NEWS Dec 19,2024 04:53 am
అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానమన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని తీసుకు రావాలని షా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తీసినట్టేనని ఆరోపించారు.