తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Dec 19,2024 04:05 am
శ్రీవారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారిని 70,457 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,152 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా సమర్పించే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.16 కోట్లు వచ్చినట్లు ఈవో తెలిపారు. ప్రస్తుతం భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేకుండా ఉన్న భక్తులకు కనీసం 15 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.