Logo
Download our app
విద్యార్థినులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ
NEWS   Dec 19,2024 03:19 am
టాస్క్ ఆధ్వర్యంలో హనుమకొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ, పీజీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థినులకు నైపుణ్యాల అభివృద్ధిపై వారం రోజుల శిక్షణ తరగతులను ప్రారంభించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి. శ్రీలత తెలిపారు. విద్యార్థులు వివిధ నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడు మాత్రమే ఉపాధి అవకాశాలను అందుకోవచ్చని అన్నారు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మనోజ్, వైస్ ప్రిన్సిపాల్ S.మాలతి, టాస్క్ కోఆర్డినేటర్ K.గీతారాణి, అధ్యాపక బృందం, విద్యార్థినిలు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source