Logo
Download our app
పశువైద్య కేంద్రాన్ని తనిఖీ చేసిన క‌లెక్ట‌ర్
NEWS   Dec 18,2024 10:30 am
మెట్‌పల్లి మండలం చౌలమద్ది ప్రాథమిక పశువైద్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్ బి. సత్యప్రసాద్. మండలంలో జరుగుతున్న పశువైద్య కార్యక్రమాలు, పశుగణన, గాలికుంటు టీకాల కార్యక్రమం, రోజువారీ పశువైద్యసేవల గురించి, టీకాల వివరాలు, పశుగణన వివరాలు ఆన్‌లైన్ అప్లోడింగ్ సంబంధించిన వివరాలు మండల పశువైద్యాధికారిణి డాక్టర్ మనీషా పటేల్‌ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ SL మనోహర్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ నరేష్ బోనగిరి పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source