10 గంటల్లో మిస్సింగ్ కేసు క్లోజ్!
NEWS Dec 18,2024 10:25 am
మెట్‌పల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్ హాస్టల్ నుంచి పారిపోయిన విద్యార్థి ఆచూకీని పది గంటల్లోనే కనిపెట్టారు సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలోని పోలీసులు. మెట్‌పల్లి పట్టణంలోని ఆదర్శనగర్‌కు చెందిన విద్యార్థి స్కూల్ హాస్టల్‌లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం హాస్టల్ నుంచి బయటకు వెళ్లిపోయాడని హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారమివ్వగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేస్ ఫైల్ చేసి పోలీసులు 2 బృందాలుగా గాలింపు చేపట్టి, కొలనూరు రైల్వే స్టేషన్‌లో బాలున్ని పట్టుకున్నారు.