ఏసీబీకి సీఎస్ శాంతి కుమారి లేఖ
NEWS Dec 17,2024 07:18 pm
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ కార్యదర్శి అరవింద్ కుమార్ పై విచారణ చేపట్టాల్సిందిగా ఏసీబీకి లేఖ రాశారు. దీంతో పాటు విచారణకు ఆమోదిస్తూ గవర్నర్ రాసిన లేఖను కూడా జతపర్చారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వెంటనే విచారణ చేపట్టాల్సిందిగా స్పష్టం చేశారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దమైంది.