Logo
Download our app
గ్రూప్‌-2 పరీక్షలో నిర్మల్‌ ప్రస్తావన
NEWS   Dec 17,2024 05:55 pm
టీఎస్‌పీఎస్‌సీ ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన గ్రూప్‌-2 రెండో పరీక్షలో నిర్మల్‌ జిల్లా ప్రస్తావన కనిపించింది. 18వ శతాబ్దంనాటి రాంజీగోండ్‌ తన బృందంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆసిఫాబాద్‌ ప్రాంతం నుంచి నిర్మల్‌ వరకు తన ప్రాబల్యాన్ని పెంచుకుని బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అంశాలపై ప్రశ్న అడిగారు. రాంజీగోండ్‌తోపాటు వెయ్యిమంది యోధులను నిర్మల్‌ ప్రాంతంలో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం మర్రిచెట్టుకు ఉరివేసింది. వేయి ఉరుల మర్రిగా ప్రసిద్ధిగాంచిన ప్రాంతం, రాంజీగోండ్‌ స్వతంత్ర పాలనారాజధాని అంశాలపై ప్రశ్న సంధించారు.
⚠️ You are not allowed to copy content or view source