Logo
Download our app
ఖానాపూర్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి
NEWS   Dec 17,2024 05:56 pm
నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అసెంబ్లీలో కోరారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖానాపూర్ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తామని అబద్దపు మాటలు చెప్పి అధికారాన్ని చేజిక్కించుకున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందని పేర్కొన్నారు. గతంలో అనేక సార్లు ఖానాపూర్ ను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని ఉద్యమాలు, ధర్నాలు రాస్తారోఖోలు నిర్వహించారని గుర్తు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source