కూల్చిన ఇళ్లకు ఈఎంఐలు చెల్లిస్తారా
NEWS Dec 17,2024 11:26 am
మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చి వేసిన బాధితుల ఇళ్లకు సంబంధించిన ఈఎంఐలు ప్రభుత్వం చెల్లిస్తుందా లేదా అన్న విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అభివృద్ది పేరుతో విధ్వంసం సృష్టిస్తే ఎలా అని ప్రశ్నించారు. తలా తోకా లేకుండా నిర్ణయాలు తీసుకుని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తామంటే కుదరదని, స్పష్టమైన విధానం అన్నది ఏదీ లేదన్నారు.