Logo
Download our app
ఆక్ర‌మ‌ణ‌ల‌పై క‌మిష‌న‌ర్ గుస్సా
NEWS   Dec 17,2024 10:24 am
హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సీరియ‌స్ అయ్యారు. న‌గ‌రంలోని క‌ముని చెరువు, మైస‌మ్మ చెరువుల‌ను సంద‌ర్శించారు. కొత్త‌గా ఆక్ర‌మ‌ణ‌లు చేప‌ట్ట‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ‌మే కూల్చి వేయాల‌ని ఆదేశించారు. 2024 జూలై తర్వాత నిర్మించిన నిర్మాణాలను మాత్రమే కూల్చి వేస్తామని కమిషనర్ ఉద్ఘాటించారు. అవి చట్ట బద్ధమైనా లేదా చట్ట విరుద్ధమైనా అనే దానిపై విచార‌ణ జ‌రుపుతామ‌ని చెప్పారు.
⚠️ You are not allowed to copy content or view source