కొండగట్టులో భక్తుల రద్దీ
NEWS Dec 17,2024 07:05 am
ధనుర్మాస ఉత్సవాల సందర్బంగా ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులు బారులు తీరారు. చలి తీవ్రత ఉన్నప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో కొండపైకి చేరుకుంటున్నారు. ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు ఉప ఆలయమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి, పంచామృత అభిషేకం, తులసి దళార్చన చేశారు. ఈ సందర్బంగా ఆలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి.