గ్రామపంచాయతీ కారోబార్ల అరెస్ట్
NEWS Dec 17,2024 06:11 am
కోరుట్ల మండలంలోని గ్రామపంచాయతీ కారోబార్లను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ లో జరిగే ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ రామచందర్ తెలిపారు. మండలంలోని 15 గ్రామాలకు చెందిన కారోబార్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.