బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
NEWS Dec 16,2024 11:57 am
లగచర్ల బాధితులకు అండగా కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆందోళన బాట పట్టారు. రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేపట్టారు. ఇదేం రాజ్యం అంటూ నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నారని, రాచరిక పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.