జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు షురూ
NEWS Dec 17,2024 05:53 pm
క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం సీఎం కప్ -2024 జిల్లా స్థాయి క్రీడా పోటీల ప్రారంభం సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ స్ట్రీడియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం కప్ క్రీడా పోటీలలో గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయిలో పాల్గొనేలా యువతను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.