పోలీసులకు మోహన్ బాబు షాక్
NEWS Dec 14,2024 05:09 am
కుటుంబ కలహాల నేపథ్యంలో మోహన్ బాబుకు చెందిన వెపన్ ను సీజ్ చేయాలని రాచకొండ సీపీ ఆదేశించారు. పిస్టల్ ను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన వారికి మోహన్ బాబు లేరని సమాధానం వచ్చింది. అయితే రెండు మూడు రోజుల్లో డిపాజిట్ చేస్తానని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.