సర్కార్ నిర్వాకం రైతులకు శాపం
NEWS Dec 14,2024 04:52 am
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కూటమి సర్కార్ నిర్వాకం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని ఆరోపించారు. భీమా వర్తింప చేయక పోవడం వల్ల తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన చెందారు. కూటమి సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టు కోవాలని అన్నారు.