బీజేపీ అగ్రనేత అద్వానీకి అస్వస్థత
NEWS Dec 14,2024 04:49 am
భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబీకులు హుటా హుటిన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్బంగా అద్వానీ ఆరోగ్యంపై ఆరా తీశారు దేశ ప్రధానమంత్రి మోడీ. మెరుగైన వైద్య చికిత్స అందజేయాలని సూచించారు. ప్రస్తుతం అగ్ర నేతలు ఆస్పత్రి వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.