కాస్మోటిక్ చార్జీల పెంపు ప్రారంభోత్సవం
NEWS Dec 13,2024 04:23 pm
రేపు రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల్లో డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నందున నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లలో ఈ కార్యక్రమమును పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, ఆర్సిఓ లు, ఎంపీడీఓలు, తహశీల్దార్లతో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సాయంత్రం రివ్యూ చేశారు.