సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం
NEWS Dec 13,2024 05:27 pm
కామారెడ్డి: లగచర్ల కేసులో రైతులకు బేడీలు వేయడం సిగ్గుచేటని బీజేపీ కిసాన్‌మోర్చా నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రైతులను అవమానపరిస్తే కేసీఆర్‌కు పట్టిన గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు వేణు, రవీందర్, రాజు, రజినీకాంత్, రాజేశ్, రాజగోపాల్, సాయి, గోవర్ధన్, మహేష్, ప్రభాకర్ పాల్గొన్నారు.