అల్లు అర్జున్ అరెస్ట్ అప్రజాస్వామికం
NEWS Dec 13,2024 10:57 am
అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమాను ఎందుకు ప్రదర్శించారంటూ ప్రశ్నించారు. అయితే తొక్కిసలాటలో రేవంతి మృతి చెందడం బాధాకరమని అన్నారు. కక్ష సాధింపుతోనే బన్నీని అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు.