కేటీఆర్ పై కేసుకు గవర్నర్ ఓకే
NEWS Dec 13,2024 05:02 am
మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. రూ. 46 కోట్లు ఎలాంటి అనుమతి లేకుండానే తను మంత్రిగా ఉన్న సమయంలో బదిలీ చేశారంటూ ఆరోపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏసీబీ కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గవర్నర్ కు లేఖ రాసింది. లీగల్ సహాయం తీసుకున్న తర్వాత గవర్నర్ ఓకే చెప్పారు. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ పై కేసు నమోదు కానుంది.