Logo
Download our app
టీచర్ కొట్టడంతో విద్యార్థి చేయికి పాక్చర్
NEWS   Dec 13,2024 04:09 am
నిజామాబాద్‌ దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని టీచర్ కొట్టడంతో చేయికి పాక్చర్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ హైస్కూల్‌లో అశ్విత 10వ తరగతి చదువుతోంది. జామెట్రీ బాక్స్‌ మర్చిపోయి స్కూల్‌కు వెళ్లిన అశ్విత ఇంటికి వచ్చి బాక్స్‌ తీసుకొని వెళ్లింది.ఆలస్యంగా వచ్చావంటూ మ్యాథ్స్‌ టీచర్‌ కల్పన కర్రతో విచక్షణారహితంగా అశ్వితను కొట్టింది. చేయికి గాయం కావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చేయికి పాక్చర్ కావడంతో కట్టు కట్టించారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source